
మహిళా సాధికారత కోసమే మిషన్ శక్తి పథకం
రాయచోటి : మహిళల భద్రత, సాధికారత పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించిందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా మిషన్ శక్తి పథకంలో భాగంగా సంకల్ప కార్యక్రమాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రతకు చట్టాలను చేయడం జరిగిందని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం భేటీ భచావో, భేటీ పడావో, మహిళల భద్రత, చట్టపరమైన అవగాహన, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మహిళలు–కౌమార బాలికల ఆరోగ్యం, పోషకాహారం, సమాజంలో జరిగే క్రైమ్ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారిణి హైమావతి, తదితరులు పాల్గొన్నారు.