
భారత్ అగ్రదేశంగా అవతరించడమే మోదీ లక్ష్యం
రాజంపేట టౌన్ : భారతదేశం అగ్రదేశంగా అవతరించడమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజంపేటకు చెందిన నాగోతు రమేష్‌నాయు డు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న తరువా త తొలిసారిగా రాజంపేటకు విచ్చేసిన సందర్భంగా శనివారం పట్టణంలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఆర్దిక వ్యవస్థ దివాలా తీసిన తరుణంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక గాడిలో పెట్టారన్నారు. 2032 నాటికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో పదవులు వస్తాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు, ఆదోని, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, డాక్టర్ పార్థసారధి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
సోలార్ సిస్టం ప్రారంభించిన మంత్రి
ఓబులవారిపల్లె : మంగంపేట గల్లా పెట్రోల్ బంక్‌లో శనివారం ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ సోలార్ సిస్టమ్‌ను ప్రారంభించారు. అనంతరం మంగంపేట గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రమేష్ నాయుడు, గల్లా శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ
వీరబల్లి : వీరబల్లి మండలం సానిపాయి గ్రామంలో రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ ముక్కుపోకు రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్