
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
రాజంపేట : పట్టణంలోని వెంకటపల్లెరోడ్డులోని భవానీ నగర్ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం పట్టణ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ నాగార్జున మాట్లాడుతూ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రాజంపేట ఏఎస్పీ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.15120 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలని, వారు పేర్లు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. సమాచారాన్ని 912110056 9(సీఐ), 9121100570 (ఎస్‌ఐ) నంబర్లకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.