
మహానేతకు ఘన నివాళి
మహానేతకు ఘన నివాళి
రాజన్న సేవలు స్మరించుకున్న నేతలు
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అణగారిన వర్గాలకు తోడుగా, రైతన్నకు నేస్తమై, గూడులేని పేదలకు ఇళ్ల రూపంలో వరమై నిలిచారంటూ మహానేతను స్మరించుకున్నారు. 16 ఏళ్ల కిందట నల్లకాలువ ప్రాంతంలో జరిగిన ఘోర సంఘటనను గుర్తు చేసుకుంటూ మహానేతకు నివాళులు అర్పించారు.
జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకాలు చేసి లక్షలాదిమంది రైతులకు ఊపిరి పోశారంటూ గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో అనేక మంది అభాగ్యులు, ఆర్థికంగా బలంలేని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ప్రాణాలను నిలిపిన దేవుడిగా కొలిచారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి వారి ద్వారా వేల మందికి అన్నార్పణం చేయించారన్న మాటలు వినిపించాయి. వీటితోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదింటి విద్యార్థులకు వెలుగులు నింపిన మహానుభావుడిగా కీర్తించారు. ఇలా 108 లాంటి అనేక సంక్షేమ పథకాలతో మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మననం చేసుకున్నారు.
● అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, మదనపల్లిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిస్సార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వాడల్పాడు, పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాజంపేటలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డితోపాటు ఆయా ప్రాంతాలలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
పుల్లంపేటలో చీరెలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి రామసముద్రం మండలం చెంబకూరులో అన్నదానం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి

మహానేతకు ఘన నివాళి