
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చరిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఘనంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సాయికృష్ణ, పలువురు అర్చకులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ బుధవారం పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం, శాత్తుమొర, నివేదన జరుగుతాయన్నారు. 4వ తేదీ మూడో రోజు గురువారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ఊరేగింపు నిర్వహిస్తారని తెలిపారు.