కూటమి పాలన.. ధ్వంస రచన ! | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలన.. ధ్వంస రచన !

Sep 3 2025 4:51 AM | Updated on Sep 3 2025 4:51 AM

కూటమి

కూటమి పాలన.. ధ్వంస రచన !

కూటమికి లొంగలేదనే..

మమ్మల్ని నిర్వాసితుల్ని చేశారు..

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి

ఫ్యాక్టరీ, ఇల్లు కూల్చివేత

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీటీడీ చర్యలు

నిరాశ్రయులైన వలస కూలీలు

కూటమి నేత ప్రలోభాలే

కారణమంటున్న బాధితులు

ఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారి ఉద్యాన పంటలను నరికి వేయడం, అధికారుల సహాయంతో నిర్మాణాలను కూల్చి వేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో కూడా అలాంటి ఘటననే జరిగింది.

మండల పరిధిలోని నరవకాటిపల్లి పంచాయతీలో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న 1520 సర్వే నెంబర్‌లో సుమారు 30 ఏళ్ల నుంచి 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ నివాసాలలోనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అబ్బిరెడ్డి 2014 ఏప్రిల్‌ నుంచి 6 సెంట్ల స్థలంలో సిమెంట్‌ బ్రిక్స్‌ ఇండస్ట్రీని నడుపుతున్నారు. అక్కడే ఉండేందుకు నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అనుమతులు పొంది, వారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలు పొంది, అధికారికంగానే నివాసం ఉంటున్నారు. అయితే అబ్బిరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇది ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయ భూమి అంటూ మంగళవారం టీటీడీ ఎస్టేట్‌ అఫీసర్‌ సువర్ణమ్మ, టీటీడీ రెవెన్యూ అధికారి లలితాంజలి ఉన్నట్టుండి తన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూలగొట్టారని బాధితుడు అబ్బిరెడ్డి వాపోయారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటిని, ఫ్యాక్టరీని కూలగొట్టడం చూస్తే ఒంటిమిట్ట మండలానికి చెందిన కూటమి నేత ప్రలోభాలకు లొంగి టీటీడీ అధికారులు ఇదంతా చేశారన్నారు. ఈ సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీని నమ్ముకుని 50 మంది వలస కూలీలు ఫ్యాక్టరీ వద్దే జీవనం సాగిస్తున్నారు. కూల గొట్టే క్రమంలో వారి సామగ్రిని కూడా ఇంటిలో నుంచి బయట పడేసి, ఇంటిని కూల్చడంతో నిరాశ్రయులమయ్యామంటూ వలస కూలీలు కన్నీరు మున్నీరయ్యారు. ఇదేమిటని టీటీడీ రెవెన్యూ అధికారులను బాధితులు అడిగితే టీటీడీ స్థలంలో మీరు సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీ నడపడం నేరమని చెబుతున్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ నడపడం నేరమైతే ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలే గాని, టీటీడీలోకి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం విలీనం కాకముందే కట్టిన కట్టడాలను ఇలా కూలగొట్టడం న్యాయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తాను వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడిననే కక్షతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటమి నేతలు టీటీడీ అధికారులను పావులా వాడుకున్నారని బాధితుడు అబ్బిరెడ్డి ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడంతో సుమారు రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.

అబ్బిరెడ్డి ఇంటిని జేసీబీ సాయంతో కూలగొడుతున్న టీటీడీ రెవెన్యూ అధికారులు

పూర్తిగా నేలమట్టం అయిన అబ్బిరెడ్డి నివాసం

కొన్ని రోజుల క్రితం ఒంటిమిట్ట మండలంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి లొంగ లేదని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన అబ్బిరెడ్డిపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీటీడీ అంటే ఆధ్యాత్మికతకు ప్రపంచ వ్యాప్తంగా పెట్టింది పేరు. అలాంటి టీటీడీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్యుల నిర్మాణాలను, ఆస్తులను ధ్వంసం చేయడంపై దుర్మార్గం. 2000 సంవత్సరంలో 1520 సర్వే నెంబర్‌ని సబ్‌ డివిజన్‌ చేశారు. ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీలో వీలీనం చేయకముందే 2014లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఇక్కడ సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని చిన్నపిల్లలతో జీవిస్తున్న 50 మంది వలస కార్మికులకు జీవనాధారం లేకుండా పోయింది. ఉండేందుకు గూడు కూడా లేదు. బాధితులకు అండగా ఉంటాం. దీనిపై న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తాం.

– ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి,

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీని నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. వారు నిర్మించిన ఇంటిలో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న మమ్మల్ని నేడు టీటీడీ వారు నిరాశ్రయులను చేశారు. ఇంటిలో పనిచేసుకుంటున్న మమ్మల్ని బయటికి పంపి, మా సామాన్లను విసిరేసి ఇంటిని కూలగొట్టారు. ఇప్పుడు చిన్న పిల్లలను తీసుకుని ఎక్కడికి వెళ్లాలి.

– నిర్మల, వలసకూలీ

కూటమి పాలన.. ధ్వంస రచన !1
1/2

కూటమి పాలన.. ధ్వంస రచన !

కూటమి పాలన.. ధ్వంస రచన !2
2/2

కూటమి పాలన.. ధ్వంస రచన !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement