
రేపటి నుంచి పాతరాయచోటి దర్గా ఉరుసు
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం పాతరాయచోటిలో వెలసిన హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. 4వ తేదీ గంధం ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5న మధ్యాహ్నం దర్గా ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం, అదే రోజు సాయంత్రం ఉరుసు ఉత్సవం జరగనుంది. 6న తహలీల్ ఫాతేహా కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నాయి. ఉరుసు ఉత్సవాల్లో హిందూ, మహమ్మదీయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.