నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం | - | Sakshi
Sakshi News home page

నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం

Sep 3 2025 4:51 AM | Updated on Sep 3 2025 4:51 AM

నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం

నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం

నాటుసారా రహిత జిల్లాగా ఆమోదం

ఈ–ఆటో అందజేత

రాయచోటి: నవోదయ 2.0 కార్యక్రమం కింద నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి అన్నమయ్య జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించామని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ జి.మధుసూదన్‌, ఏఈఎస్‌ జోగేంద్ర, ఆర్డీఓ శ్రీనివాస్‌, డీఆర్‌డీ పీడీ సత్యనారాయణ, ఎల్డీఎం ఆంజనేయులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ దాసరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

రాయచోటి టౌన్‌: రాజంపేట నియోజకవర్గ పెద్దకారంపల్లెకు చెందిన వెంకటేశ్వర రాజు అభ్యర్థన మేరకు కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి ఈ–ఆటోను అందజేశారు. రూ.3.45 లక్షల విలువైన ఆటోను మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో వెంకటేశ్వర రాజు కుటుంబ సభ్యులకు అందించారు.

జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement