
జర్నలిజం కోర్సులో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమో కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు నేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్షీప్రసాద్ తెలిపారు.జర్నలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్ ఆర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించినవారు అర్హులని చెప్పారు. కౌన్సిలింగ్’కు అభ్యర్థులు అన్ని రకాల అర్హత పత్రాలతో నేరుగా విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. వివరాలకు యోగి వేమన విశ్వవిద్యాలయం www.yvu. edu.in ను సందర్శించాలని ఆయన సూచించారు.