
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
రాజంపేట : తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలేదంటూ మున్సిపాలిటి కార్మికులు చేపట్టిన నిరసన ఆదివారం ఐదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే తమ తలరాతలు మారుతాయని ఆశించామన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం నిట్టనిలువునా తమ పొట్టలు కొడుతోందన్నారు. సీఐటీయూ జిల్లా నేత చిట్వేలి రవికుమార్, కార్మిక నేతలు పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి టౌన్ : రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బీవీ రమణ, జిల్లా కోశాధికారి సి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేయడమే అమానత్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి జనాబ్ అబ్దుల్ రఖీబ్ తెలిపారు. ఆదివారం కడప నగరంలో అమానత్ మ్యూచువల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మూడో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేసి వారు ఆర్థికంగా కుదుటపడేందుకు, వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఈ బ్యాంకు కృషి చేస్తుందన్నారు. 2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఇస్లామిక్ బ్యాంక్ ఆవశ్యకతను తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి ఆనాటి మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు విషయాన్ని ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముతీకుర్రహ్మాన్, సంఘ సేవకులు సల్లావుద్దీన్, కడప ఇస్లామిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె