
బొప్పాయి రైతులను ఆదుకోండి
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక కూటమి నాయకులు మాయమాటలు మాని ఇక్కడి బొప్పాయి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతలాకుతలమైందన్నారు. ముఖ్యంగా మామిడి రైతులు దివాలా తీసి అప్పుల పాలయ్యారని చెప్పారు. మామిడి పంటను కోసి అమ్ముడుపోక ఉన్నఽ ధరకు కూలీలకు కూడా గిట్టుబాటు కాక మామిడి పంటను తోటలలోనే వదిలేశారన్నారు. అయిప్పటికీ ప్రభుత్వం, కూటమి నాయకులు మాయమాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు బొప్పాయి రైతులు అప్పులపాలు కాకుండా ఆదుకోవాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి
కొరముట్ల శ్రీనివాసులు