ఆరా తీయండి.. ఆట కట్టించండి ! | - | Sakshi
Sakshi News home page

ఆరా తీయండి.. ఆట కట్టించండి !

Jul 25 2025 4:41 AM | Updated on Jul 25 2025 4:41 AM

ఆరా త

ఆరా తీయండి.. ఆట కట్టించండి !

మదనపల్లె రూరల్‌/కురబలకోట : ఆరా యాప్‌ మోసానికి బలైన బాధితులు గురువారం పెద్ద ఎత్తున మదనపల్లె వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. వీడియోలు చూస్తే చాలు డబ్బులు వస్తాయన్న అత్యాశకు పోయి ఆరా యాప్‌లో పెట్టుబడి పెట్టి యాప్‌ నిర్వాహకులచే మోసానికి గురై లక్షల్లో నగదు వేల సంఖ్యలో బాధితులు పొగొట్టుకున్నారు. ఆరా యాప్‌ మోసంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వందల సంఖ్యలో బాధితులు బయటకు వచ్చారు. తాము యాప్‌లో ఏ విధంగా పెట్టుబడి పెట్టామో, తమను మాయమాటలతో ఎలా మోసం చేశారో విలేకరులకు వివరించారు. మదనపల్లె దిగువ కురవంకకు చెందిన మోహన్‌బాబు అనే వ్యక్తి నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఆరా యాప్‌ ద్వారా లక్షల్లో ప్రజల సొమ్ము కాజేసి చేతులెత్తుశాడు. వారం రోజులుగా యాప్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేయడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. సత్యసాయి జిల్లా, కర్నాటక రాష్ట్రం చింతామణి, మదనపల్లె డివిజన్‌లోని పెద్దమండ్యం, మదనపల్లె, కలికిరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. యాప్‌లో పెట్టుబడి పెట్టిన సభ్యులకు మొదట్లో కొంత మందికి నగదు ,బహుమతులు ఇచ్చి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించి భారీ మోసానికి తెరదీశారు. మోసపోయిన బాధితులు యాప్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు వ్యక్తిగత ఖాతా వివరాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర వివరాలు యాప్‌కు లింక్‌ చేశామని, దీని వల్ల తాము భవిష్యత్తులో నష్టపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆరా యాప్‌ బాధితులు వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట పడిగాపులు కాశారు. రాత్రి వరకు 300కుపైగా బాఽధితులు తాము నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో బాధితులు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై మోహన్‌బాబును అదుపులో తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడే నిందితుడి వద్ద యాప్‌కు సంబంధించిన వివరాలు, వ్యాపార లావాదేవీలు, అందుకు సంబంధించిన అనుమతులు తదితర అంశాలపై విచారించారు. అనంతరం నిందితుడిని రాత్రి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించగా అప్పటి వరకు అక్కడే వేచివున్న బాఽఽధితులు పోలీసుల సమక్షలోంనే నిందితుడిని చుట్టుముట్టారు. తమకు యాప్‌లో నగదు విత్‌డ్రా అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్‌ సీఐ ఏరిసావలీని కోరారు. యాప్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు మోహన్‌బాబు ద్వారా మెసేజ్‌ పెట్టించారు. అయినా బాధితుల అకౌంట్లు పునరుద్ధరించడం వీలుకాదంటూ యాప్‌ నిర్వాహకుల నుంచి తిరుగు మెసేజ్‌ రావడంతో సభ్యులంతా ఒక్కసారిగా తాము పూర్తిగా మునిగిపోయామని తమ నగదు తిరిగి రాదని సీఐ,ఎస్‌ఐలకు వివరించారు. అనంతరం నిందితుడు మోహన్‌బాబును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ భారీ ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన మోహన్‌బాబుపై కేసు నమోదు చేస్తామన్నారు. విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.

దేశ వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా బాధితులు

ఈ స్కీంలో వారు వీరు అని కాకుండా వివిధ వర్గాల వారు మోసపోయారు. ఆరా యాప్‌లోనే దేశ వ్యాప్తంగా 30లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు చూపారు. వేగవంతంగా ప్రాబల్యం పొందింది. కోట్లలో కొల్లగొట్టారు. నిర్వాహకులు ఎవరో ఎవరికీ తెలీదు. అంతా వాట్సప్‌ చాటింగ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించారు. రెండు రోజులుగా టాస్క్‌లు కూడా ఓపన్‌ కాలేదు. యాక్టివేషన్‌ చేసుకోవాలని నిర్ణీత నగదు చెల్లిస్తే టాస్క్‌లు వస్తాయని కండిషన్‌ పెట్టారు. అసలుకే ఎసరు పడటంతో మళ్లీ నగదు చెల్లించి యాక్టివేషన్‌ ఎలా అని దిక్కుతోచని స్థితిలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.

దొరకరంతే..

ఆరా యాప్‌ నిర్వాహకులను నేరుగా చూసిన వారు మాట్లాడిన వారు లేరు. కార్యకలాపాలన్నీ వాట్స్‌ప్‌ చాటింగ్‌ ద్వారానే జరిగాయి. చట్టానికి దొరక్కుండా మొదటి నుండి జాగ్రత్త పడ్డారు. ఇండియా ప్రతినిధిగా లూధియా పేరుతో లావాదేవీలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉన్నట్లు ప్రొఫైల్‌లో చూపారు. లక్షలాది మందిని నిలువునా ముంచేసిన నిర్వాహకులపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, పోలీసులను బాధితులు కోరుతున్నారు.

పోలీసు స్టేషన్‌కు క్యూకట్టిన

ఆరా యాప్‌ బాధితులు

ఇతర జిల్లాల నుంచి

మదనపల్లె స్టేషన్‌లో ఫిర్యాదు

ఉదయం నుంచి రాత్రి వరకు

స్టేషన్‌ వద్దే నిరీక్షించిన బాధితులు

ఆరా తీయండి.. ఆట కట్టించండి !1
1/1

ఆరా తీయండి.. ఆట కట్టించండి !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement