అన్నమయ్య జలాశయాన్ని నిపుణుల బృందం ఈ నెల 13న పరిశీలించింది. ఈ బృందం ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్థితి గతులపై అంచనా వేసింది. అన్నమయ్య జలాశయంను నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ బృందంలో... ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్ధితి గతులపై బృందం అంచనా వేసింది. ఈ బృందంలో డిజైన్ ఎక్స్‌ఫర్ట్‌గా పీపీఏ చీఫ్ ఇంజినీర్ రమేష్‌కుమార్, హైడ్రో మెకానికల్ ఎక్స్‌ఫర్ట్‌గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కె.సత్యనారాయణ, జియాలిజిస్టుగా జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్(రిటైర్డ్) ఎం.రాజు, డిజైన్ అప్రూవింగ్ అథారిటీగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డబ్ల్యూఆర్‌డీ చీఫ్ ఇంజినీరు, హైడ్రాలజి ఎక్స్‌ఫర్ట్‌గా విజయవాడకు చెందిన హైడ్రాలజి చీఫ్ ఇంజినీరు, కన్వీనర్‌గా కడప డబ్ల్యూఆర్‌డీ చీప్ ఇంజినీర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జలాశయం డిజైన్ చేసేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించింది. అన్నమయ్య జలాశయం పునఃనిర్మాణానికి సంబంధించి డిజైన్, నిర్మాణం, పునరుద్ధరణ చర్యలు తదితర అంశాలపై టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ దృష్టి సారించింది. ఈ బృందం ఏమి చెబుతుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది.