
పాత పింఛన్ అమలు చేయాలని నిరసన
కడప ఎడ్యుకేషన్ : తమకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం నాయకులు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటజనార్దనరెడ్డి, ఎన్‌డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు జనార్దన్‌రాజు, పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఎస్‌ఎల్‌డీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ప్రకారం అర్హులైన వారందరికీ పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కన్వీనర్లు సుధాకర్, చాంద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, సునీత, రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.