
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభు త్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాసులు, మున్సిపల్ వర్క ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.నాగేంంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజినీరింగ్ కార్మికుల నైపుణ్యం ఆధారంగా వేతనాలు చెల్లించలేదన్నారు. గతంలో సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం సరికాదన్నారు. ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం దారుణమన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం మంచిది కాదన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, మట్టి ఖర్చు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు నాగార్జున, వెంకటరమణ, డి.హరి, డి.నాగేంద్రబాబు, దేవమ్మ, చంద్రశేఖర్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.