
ఐచర్ వాహనం ఢీకొని ఒకరికి గాయాలు
మదనపల్లె రూరల్ : ఐచర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని తురకపల్లెకు చెందిన సయ్యద్‌సాహెబ్(54) నమాజుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. మార్గ మధ్యంలో పీలేరు నుంచి బెంగళూరు వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో సయ్యద్‌సాబ్ తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడి కుమారుడు ఖాదర్‌సాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు.
స్కూటర్లు ఢీకొని..
రాయచోటి టౌన్ : రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ కథనం మేరకు..పట్టణానికి చెందిన ఖాదర్ బాషా రాయచోటి నుంచి రాయవరం వెళ్లుతున్నాడు. అదే సమయంలో రెడ్డెయ్య రాజు టీవీఎస్‌పై రాయచోటికి వస్తున్నాడు. రాయచోటి – సుండుపల్లె రోడ్డులోని గంగోత్రి(గురుకుల పాఠశాల సమీపంలో)గంగోత్రి వాటర్ ఫ్లాంట్ వద్దకు రాగానే రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో కడప ఆస్పత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.