
బాధిత కుటుంబాలను ఉపాధి చూపాలి
కడప–రేణిగుంట జాతీయరహదారిలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగిన లారీ బోల్తా ప్రమాద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి అన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. శెట్టిగుంటకు చెందిన గిరిజనుల కుటుంబాలకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సహాయంతో పాటు ఆ కుటుంబాలకు ఉపాధి మార్గాలను చూపించాలన్నారు. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. శెట్టిగుంట గిరిజన కుటుంబాలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నానన్నారు.