
మిట్స్ కళాశాలకు ప్రమోషన్
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లు దగ్గరున్న మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీ (విశ్వ విద్యాలయం)గా ఆవిష్కృతమైంది. ఈ మేరకు న్యూడిల్లీలోని యూజీసీ మంగళవారం ప్రకటించింది. ఈఘనత సాధనతో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకులు, పాలక వర్గ సభ్యులు, కళాశాల శ్రేణులతో పాటు జిల్లా వాసులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక సరికొత్త నూతన ప్రస్తానమే కాకుండా నూతన అధ్యాయానికి నాంది అని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1998లో స్థాపితమైన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి రెండు దశాబ్దాలుగా అనేక రికార్డులు సృష్టించింది. పరి శోధన, విజ్ఞాన ప్రదర్శనలు, పారిశ్రామిక సహకా రాల్లో విశేషంగా రాణించింది. మరెన్నో గుర్తింపులు పొందింది. ఎన్‌బీఏ, న్యాక్ వంటి సంస్థల నుండి ప్రత్యేక గుర్తింపు పొందింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం యూజీసీ నుండి డీమ్డ్ హోదా లభించింది. దీంతో ఈ కళాశాల ఉన్న తంబళ్లపల్లె నియోజక వర్గానికే కాకుండా పక్కనున్న మదనపల్లె నియోజక వర్గంకు కూడా ఇది తల మానికంగా మారింది. ఇన్నేళ్లు యూనివర్సిటీ అంటే తిరుపతి, అనంతపురం లేదా పక్కనున్న కర్నాటక, చైన్నె లోని యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల యూనివర్సిటీ కావడంతో ఉన్నత చదువులు దగ్గరయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఆనందోత్సాలతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది నుండే అడ్మిషన్లకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనుమతిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
సీమకే గర్వకారణం
ఇది అన్నమయ్య జిల్లా విద్యా క్షేత్రంలో మరో ఘన విజయం. మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందడం కళాశాలకే కాకుండా సీమ ప్రాంతంలోనే ఏకై క కేంద్రీయ డీమ్డ్ యూనివర్సిటీ కావడం గర్వకారణం.
– డాక్టర్ విజయ భాస్కర్‌ఽచౌదరి, కరస్పాండెంట్,
మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లె
డీమ్డ్ యూనివర్సిటీగా మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల
అంతటా హర్షాతిరేకం
అన్నమయ్య జిల్లాకు మకుటాయమానం
రాయలసీమలోనే ఏకై క కేంద్ర డీమ్డ్ యూనివర్సిటీగా రికార్డు
ఈ ఏడాది నుండే అడ్మిషన్లు