
ముగిసిన తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు స్వయంగా అర్చించి, పూజించిన శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వార్ల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ముగిసాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టులు సంయుక్తంగా పది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాయి. కాగా బ్రహ్మోత్సవాల ముగింపు రోజు శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, గ్రామస్తులు ఉద్దండం సుబ్రమణ్యం, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీతోపాటు గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పుష్పయాగంలో పాల్గొన్నారు.

ముగిసిన తాళ్లపాక బ్రహ్మోత్సవాలు