
వైభవంగా పుష్పయాగం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలిరేకులు వంటి వివిధ రకాల పుష్పాలు, తులసి, మరువం, ధవనం వంటి ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సునీల్‌కుమార్, సాయిస్వామిలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం పాల్గొన్నారు.
ముగిసిన సౌమ్యనాథస్వామి
బ్రహ్మోత్సవాలు