
అమ్మా... ఎందుకు ఏడుస్తున్నావు!
ఈ ఫొటోలో వీల్‌చైర్‌లో కూర్చొన్న మహిళ పేరు విజయలక్ష్మి . మామిడి పండ్లు లోడింగ్ చేసేందుకు భార్య,భర్త వెళుతూ చిన్నపిల్లలైన గంగోత్రి, చెంచితలను కూడా తీసుకెళ్లారు. అనుకోని ప్రమాదం ఎదురు కావడంతో విజయలక్ష్మి తన పిల్లలు ఇద్దరినీ గట్టిగా పట్టుకుని పడిపోయింది. దీంతో పిల్లలకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదంలో భర్త శ్రీనివాసులు మృతి చెందాడన్న వార్త జీర్ణించుకోలేకపోతోంది. విజయలక్ష్మికి గాయాలు కావడంతో నడవలేని స్థితిలో ఉంది. మరోవైపు విజయలక్ష్మి తండ్రి వెంకటయ్యకు కూడా చేయి విరగడంతో ఎదురుగా కూర్చొని విలపిస్తున్నాడు. ఏమీ తెలియన చిన్నారులు మాత్రం నాన్న లేరన్న విషయం తెలియక అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వారు కూడా ఏడుస్తున్నారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సోమవారం కనిపించిన ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.