
సిద్దవటంలో పిచ్చికుక్క స్వైరవిహారం
సిద్దవటం : సిద్దవటంలోని దిగువపేటలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఐదుగురిని కాటువేసింది. దిగువపేట గాంధీవీధిలో ఉదయం 6 ఏళ్ల బాలుడు కోటపాటి నందక్రిష్ణ దారిన వస్తుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కాటువేసింది. అలాగే అదే వీఽధికి చెందిన బత్తల బాలగురవయ్య, బాలింత పాలెం వసంత, బేల్దారు వీధికి చెందిన 5 ఏళ్ల బాలిక ఫాతిమా, దిగువపేట బజారు వీధిలో మరొకరిపై పిచ్చికుక్క దాడి చేసి కాటువేసింది. కుక్క కాటుకు గురైన వారు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్, ఇన్‌జెక్షన్‌లను వేయించుకున్నారు. సిద్దవటంలో కుక్కలు, ఆవులను పెంచుకునే వారు ఇంటి వద్ద కట్టేసుకొని పెంచుకోవాలని, గ్రామంపై వదిలేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ హెచ్చరించి సోమవారం సిద్దవటం గ్రామ పంచాయతీలో చాటింపు వేయించారు.
ఒకే రోజు ఐదుగురిపై దాడి