
పాల కొండలు అటవీ ప్రాంతంలో కూంబింగ్
సిద్దవటం : పాలకొండలు అటవీ ప్రాంతంలోని సమ స్యాత్మక ప్రదేశాల్లో కూంబింగ్ నిర్వహించినట్లు కడప రేంజర్ ప్రసాద్ తెలిపారు. సిద్దవటం మండలంలోని రాజీవ్ స్మృతి వనంలో శనివారం ఆయన మాట్లాడుతూ కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదేశాల మేరకు కడప ఫారెస్టు రేంజ్ పరిధిలోని పాలకొండలు అటవీ ప్రాంతమైన భాకరాపేట ఫారెస్టు బీటులో అనుమానిత అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం తరలి పోకుండా కూంబింగ్ నిర్వహించామన్నారు. భాకరాపేట, మిట్టపల్లి, నేకపాపురం మాచుపల్లె, మూలపల్లె తదితర గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానితులుగా కనబడితే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్‌కుమార్, ఇందిర, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.