
ఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధ విహార్‌లో విగ్రహం ధ్వంసం, తల తొలగించిన ఘటనకు సంబఽంధించి తప్పుడు కేసులు నమోదు చేయించిన ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాద ఘటనపై, తాలూకా సీఐ కళా వెంకటరమణ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించకుండా కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బుద్ధ అంబేడ్కర్ సమాజ్ ఫౌండర్ పిటీఎం శివప్రసాద్, బౌద్ధులు శాంతియుతంగా దమ్మ దీక్ష చేశారన్నారు. దీనిపై ఎస్పీ అప్రజాస్వామికంగా వ్యవహరించి, నిందితులను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులను పంపడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు శివప్రసాద్‌పై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందు, కృష్ణప్ప, సాంబశివ, సహదేవ్, బాలాజీ, రమణ, శ్రీనాథ్, శివ,చంద్ర, ప్రశాంత్, మహేశ్, అరుణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.