
చంద్రబాబు మాట.. అబద్ధాల మూట
పీలేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట... అబద్ధాల మూట అని మరోసారి రుజువైందని మాజీ ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాథ్‌రెడ్డి, అన్నారు. స్థానిక ఎంఎం.కల్యాణమండపంలో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ అంశంపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలే కలిం్పంచలేదన్నారు. మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, గత ప్రభుత్వంలో రూ.16 నుంచి రూ.18 వరకూ గిట్టుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కిలో రూ.2కు కూడా కొనలేని పరిస్థితి ఉందన్నారు. కాయలు తోటల్లోనే వదిలేసి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. చికెన్ వ్యాపారుల నుంచి కిలోకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, పోలీసులను అడ్డుపెట్టుకుని రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి పదవులు పొందిన నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనీషారెడ్డి, మైనారిటీ కమీషన్ ఛైర్మన్ ఇక్బాల్‌అహ్మద్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరసింహారెడ్డి, సుగవాసి సుబ్రమణ్యం, హరీష్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, ఆగా మోహిద్దీన్, కన్వీనర్లు దండు జగన్‌మోహన్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, ముక్తియార్, శివారెడ్డి, వెంకటరమణారెడ్డి, సర్పంచ్ హబీబ్‌బాషా. చక్రధర్, ఆనంద్ పాల్గొన్నారు.
కడప మేయర్ సురేష్‌బాబు,
చింతల రామచంద్రారెడ్డి