
కర్నాటక మద్యం స్వాధీనం
మదనపల్లె రూరల్ : ఎకై ్సజ్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 12.96 లీటర్ల ఎన్‌డీపీఎల్ కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి టూవీలర్ సీజ్ చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కర్నాటక సరిహద్దు చీకలబైలు చెక్‌పోస్ట్‌కు సమీపంలో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కురబలకోట మండలం తుంగావారిపల్లెకు చెందిన మూలి రమేష్(27), కర్నాటకకు చెందిన బెంగళూరు మాల్ట్ విస్కీ(90ఎం.ఎల్) 96 టెట్రా ప్యాకెట్లు, సుజుకీ ఆక్సెస్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి నుంచి రూ.3,840 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని, టూవీలర్‌ను సీజ్ చేశామన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన పెద్దిగాని సోమశేఖర్(28), కర్నాటకకు చెందిన హైవార్డ్స్ ఛీర్స్ విస్కీ(90ఎం.ఎల్) 48 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లోనూ ఇద్దరిని అరెస్ట్‌చేసి ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించామన్నారు.
18న చలో ఢిల్లీ
బద్వేలు అర్బన్ : కడపలో ఉక్కు పరిశ్రమ హామీ అమలు కోరుతూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్ని పేర్కొన్నారు.