
ఆరోగ్యకరమైన కుటుంబం శ్రేయస్కరం
రాయచోటి టౌన్ : ఆరోగ్యకరమైన కుటుంబం సమాజానికి శ్రేయస్కరమని డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెళ్లికి కావాల్సిన వయస్సు మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సాలు నిండి ఉండాలని చెప్పారు.ప్రణాళికబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం ఉండాలని తెలిపారు.కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌వో ఇన్‌చార్జి బలరామరాజు, డిఫ్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆర్‌ఎంవో కిరణ్, డీపీఎంఓ రియాజ్ బేగ్, డీఎన్‌ఎంవో విష్ణువర్థన్ రెడ్డి,యుపీహెచ్‌సీ వైద్యులు ఎస్‌ఓ ఓబుల్ రెడ్డి, డీఎస్‌ఓ కరీముల్లా, రాజగోపాల్, పర్యవేక్షకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, ఏఎన్‌ఓంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.