
మడుగులో యువకుడి గల్లంతు
సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామ సరిహద్దులలో ఝరికోన ప్రాజెక్టు సమీపంలోని మడుగులో యువకుడు గల్లంతు అయినట్లు సమాచారం. పోలీసుల వివరాల మేరకు కర్నూలుకు చెందిన షేక్ ఉస్మాన్ (23)అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ఝరికోన ప్రాజెక్టు దగ్గరకు వచ్చాడు. సమీపంలోని మడుగులో గల్లంతు అయినట్లు పోలీసులు తెలిపారు. మడుగు సమీపంలోని దుస్తులు, చెప్పులను గుర్తించి ఉస్మాన్ అనే యువకుడు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. చీకటి కావడంతో సోమవారం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. నీటిలో గల్లంతయ్యాడా లేక మరేమైనా జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
చిన్నమండెం : మండలంలోని వందాడి గ్రామం, తూర్పుపల్లి క్రాస్ సమీపంలో ఇన్నోవా కారు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న శేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా.. శేఖర్‌రెడ్డి వందాడి గ్రామానికి తన సొంత పనుల నిమిత్తం వచ్చాడు. తిరిగి రాయచోటిలోని తన నివాసానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. దీంతో శేఖర్‌రెడ్డి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
బైకును ఢీకొన్న కారు
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో ఆదివారం బైకును కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు స్థానిక కోదండరామస్వామి కల్యాణ వేదిక మొదటి గేటువద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై ఏపీ 04బిఏ 6437 నెంబరుగల బైకులో ఓబులవారిపల్లిలో బంధువుల ఇంటికి వెళ్తున్న ఎన్. సురేంద్ర, జి.ఉమాదేవి అనే దంపతులను తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఏపీ21ఏయూ 5699 నెంబరుగల ఇథియోస్ కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో సురేంద్ర కుడిచేయి, కాలు విరగ్గా, ఉమాదేవికి నడుము విరిగింది. వీరిని 108 సహాయంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యంకోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బహుజన టీచర్స్
యూనియన్ ఆవిర్భావం
కడప రూరల్ : బహుజన టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన సంఘం ఆవిర్భావ సమావేశం ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా మేకల శివార్జున, ప్రధాన కార్యదర్శిగా సి.సుదర్శన్ బాబు, కోశాధికారిగా ఏ.రాజబాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎం.గంగరాజు, కె.గంగాధర్, ఎం.శ్రీదేవి, ప్రేమ సాగర్ నిత్య ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడిగా గంగరాజు, కార్యదర్శిగా బేరి మోహన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కట్టా గంగాధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మడుగులో యువకుడి గల్లంతు

మడుగులో యువకుడి గల్లంతు

మడుగులో యువకుడి గల్లంతు