
లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో స్వర్ణాంధ్ర–2047 విజన్ అమలులో భాగంగా రాయచోటి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, రాయచోటి ఆర్డీఓ, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్–2047 తీసుకొస్తే దానికి అనుబంధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర–2047 విజన్ రూపకల్పనకు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసులు, నియోజకవర్గ మండలాల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి