
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న ప్రజల ఫిర్యాదుల పట్ల అలసత్వం చేయరాదని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ