
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
రాయచోటి: జిల్లా కలెక్టర్‌చామకూరి శ్రీధర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ వారు అందించిన సర్టిఫికెట్‌ను సోమవారం రాష్ట్ర రాజధాని అమరా వతిలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్‌నాయుడుతో కలిసి అందుకున్నారు.మే 28న జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక గంట యోగా సెషన్‌లో 13,594 మంది హెల్త్ వర్కర్స్‌తో యోగా చేయించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు.
29 నుంచి జూనియర్ ఫుట్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో ఈనెల 29,30 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్‌బాల్ ఛాంఫియన్ షిప్ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దిలీప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆయన వెంట పుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్,కోచ్ మహీంద్ర పాల్గొన్నారు.
డీఎంహెచ్‌బాధ్యతల స్వీకరణ
రాయచోటి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారిగా డాక్టర్ లక్ష్మీనరసయ్య బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. జిల్లా డీఎంహెచ్‌ఓగా డీఐఓ డాక్టర్ ఉషశ్రీ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూలు ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌గా ఉన్న లక్ష్మీ నరసయ్య ఇక్కడకి వచ్చారు.
గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మహల్, ఎర్రకోటపల్లి పీహెచ్‌సీలలో వైద్యాధికారిగా, మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంఓగా పనిచేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అందకి సహకారంతో జిల్లాను వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఇండికేటర్లలో మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎంహెచ్‌ఓను కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులు,కార్యాలయ సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.

డీఎంహెచ్‌బాధ్యతల స్వీకరణ