శివ తాండవ నృత్యానికి ప్రశంస
కలెక్టర్‌కు సీఎం అభినందనలు
రాయచోటి: యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. గురువారం సాయంత్రం ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే యోగాంధ్ర 2025 కార్యక్రమంపై ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో భాగంగా నెలవారీగా ఇచ్చిన శిక్షణలు యోగా ట్రైనర్లకు అందించిన సర్టిఫికెట్లు తదితర అంశాలలో జిల్లా మొదటి స్థానంలో ఉన్నందున జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
బి.కొత్తకోట: స్థానిక విద్యార్థి కాన్సెప్ట్ హైస్కూల్ విద్యార్థులు గురువారం మండలంలోని హార్సిలీహిల్స్‌పై నిర్వహించిన శివ తాండవం నృత్యాన్ని తిలకించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రశంసించారు. కొండపై యోగా కార్యక్రమానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు శివ తాండవ నృత్యాభినయం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కరెస్పాండెంట్ పూజారి రమణ, పూజారి శ్రీనివాసులు పాల్గొన్నారు.


