
విద్యార్థి అదృశ్యం
జమ్మలమడుగు : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన మంగపట్నం పవన్ అదృశ్యమైట్లు మైలవరం ఎస్‌ఐ శ్యాంసుందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగపట్నం పవన్ జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతున్నాడు. అయితే ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిపోయాడు. ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తండ్రి లింగమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యకిత రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రిమ్స్ పోలీసుల కథనం మేరకు.. వీరపునాయునిపల్లి మండలం పాలగిరి గ్రామానికి చెందిన మల్లెం కొండ జగదీష్ (42) కడప జెడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌లో పని చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 27న రిమ్స్ ఆసుపత్రి సమీపంలో పురుగుల మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆటో నిలుపుదల స్థలం కోసం ఘర్షణ
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలయపల్లి గ్రామంలో ఆటో నిలుపుదల చేసుకునే స్థలం విషయమై సాయిరాం, రమేష్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ మరింత ముదిరి ఆదివారం అర్థరాత్రి సాయిరాం ఇంటిపైకి రమేష్ , సురేష్‌లతో పాటు మరికొంత మంది కలసి దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్, సురేష్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మేకలబాలయపల్లి గ్రామానికి చెందిన సాయిరాం, రమేష్, సురేష్‌ల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే వీరి మధ్య ఆటో నిలుపుదల స్థలంపై ఆదివారం ఘర్షణ జరిగింది. అయితే అర్థరాత్రి రమేష్, సురేష్‌లతో పాటు మరి కొందరు కలసి కర్రలు తీసుకుని సాయిరాం ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో సాయిరాం, జయరాం, రామచంద్రుడు, రామదేవి, నాగవేణి, తేజ్‌రాంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు రామచంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష, సురేష్‌లతో పాటు మరి కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు.
లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించకుంటే సమ్మె చేస్తాం
ప్రొద్దుటూరు క్రైం : ఠిలారీలపై వేస్తున్న గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించకుంటే సమ్మె చేయడానికై నా వెనుకాడేది లేదని ఏపీ న్యూ ఆంధ్రా మోటార్, ట్రక్కర్స్ అసోసియేషన్ (నమ్‌తా) జనరల్ సెక్రటరి టీవీ చలపతి తెలిపారు. స్థానిక లింగాపురంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం లారీ ఓనర్లు, డ్రైవర్లకు రవాణా చట్టాలు, సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీరో ఆక్సిడెంట్ సమాజం కోసం అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై గతంలో అనేక మార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. టోల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, గ్రీన్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆరుగురికి తీవ్ర గాయాలు