
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించనున్నారు.