కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Files Complaint with Centre Against ABN | Sakshi
Sakshi News home page

కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Apr 6 2026 6:14 PM | Updated on Apr 6 2026 6:28 PM

YSRCP Files Complaint with Centre Against ABN

తాడేపల్లి: తమ నేతలను కించపరిచేలా ఏబీఎన్‌ అల్లిన కథనాలపై  వైఎస్సార్‌సీపీ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏబీఎన్‌ కథనాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖలు రాశారు ఎమ్మెల్సీ లేళ్ల. అభ్యంతరకర కథనం ప్రసారం చేసిన చానల్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

తమ పార్టీ నేతలను కించపరిచేలా..సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం ప్రసారం చేశారన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఏబిఎన్ వ్యవహరించిందంటూ ఫిర్యాదు చేశారు. ఇది అత్యంత అనైతిక చర్య అనీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement