
తాడేపల్లి : ADCET నిర్వహణలో ఏపీ ప్రభుత్వం వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘ మా ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించింది. దీనికి AICTE, UGC అనుమతులు కూడా ఉన్నాయి.
ఐతే కరోనా టైంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించలేక పోయింది. 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసి, మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం తెలిపింది. కానీ వైస్-ఛాన్సలర్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఇప్పటికీ ఆ ఆమోదం పెండింగ్‌లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ దాని గురించి పట్టించుకోకపోవడం దారుణం.
మా ప్రభుత్వ హయాంలోనే 2023–24, 2024–25 బ్యాచ్‌లకు CoA అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త విద్యార్థులను చేర్చుకోవడానికి కనీసం ADCET పరీక్షను కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదు. అసలు ADCET కోసం ఇంతవరకు కన్వీనర్‌ను కూడా నియమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రావస్థ నుండి బయట పడుతుందని, విద్యార్థులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
The TDP government failed to bifurcate JNAFAU. Our government established YSR Architecture and Fine Arts University in Kadapa in 2020–21. AICTE and UGC approvals were obtained, but the Council of Architecture (CoA) couldn’t conduct inspections during the COVID pandemic. On… pic.twitter.com/xtxszydn1Y
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025