YSR District Listed In Top 5 Most Improved Aspirational Districts - Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ టాప్‌ లిస్ట్‌లో వైఎస్సార్‌ జిల్లా.. అభినందనల వెల్లువ

Jul 18 2023 12:08 PM | Updated on Jul 18 2023 12:21 PM

YSR District Listed Top 5 most improved Aspirational Districts - Sakshi

వైఎస్సార్‌ జిల్లా ఎంతగా అభివృద్ది చెందిందో కేంద్రం తరపున.. 

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌ జిల్లాకు నీతి ఆయోగ్‌ ప్రశంసలు దక్కాయి. ప్రతీ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో.. ఆకాంక్షాత్మక జిల్లాల AspirationalDistricts మెరుగైన ఫలితాలు సాధించిన జాబితా టాప్‌-5లో మూడో స్థానంలో నిలిచింది వైఎస్సార్‌. తద్వారా అభినందనలు అందుకుంటోంది. 
 
అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, అభివృద్ధి చెందుతున్న దేశానికి పట్టుకొమ్మలంటూ నీతి ఆయోగ్‌ మొదటి నుంచి ప్రకటించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఈ జాబితాలో వైఎస్సార్‌ జిల్లా మూడో స్థానం నిలవడం విశేషం. 

ఇక..  నీతి ఆయోగ్‌ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది.

ఇదీ చదవండి: ఎగుమతుల్లో ఎగసిన ఏపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement