విశాఖలో వైఎస్సార్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

YSR Cricket Cup Tournament begins in Visakhapatnam - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు స్టేడియంలో వైఎస్సార్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీని మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నీలో 490 జట్లు పాల్గొంటున్నాయి. 15 మైదానాల్లో వచ్చే ఏడాది జనవరి 9 వరకూ మ్యాచ్‌లు జరగనున్నాయి. విజేతకు రూ.10 లక్షలు, రన్నరప్‌కు రూ.5 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ఏసీఏ ప్రెసిడెంట్‌ శరత్‌చంద్రారెడ్డిని కోరుతామన్నారు. ఆంధ్రా ఒలింపిక్‌ అసోసియేషన్‌ను కూడా విశాఖకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగానే కాకుండా క్రీడా రాజధానిగా కూడా మారనుందని వ్యాఖ్యానించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top