
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్‌పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.
The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025