‘భార్యను కొట్టినా పర్వాలేదండి’.. తెలుగు రాష్ట్రాలే టాప్‌..

Womens justification in National Family Health Survey - Sakshi

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మహిళల సమర్థింపు

దేశవ్యాప్తంగా 45.4 శాతం మంది మొగ్గు 

నమ్మకద్రోహం, ఇల్లు.. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే దండన తప్పు కాదని వ్యాఖ్య 

ఇలా సమర్థింపులో తొలి 2 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 

సాక్షి, అమరావతి: దేశంలో మహిళా రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తుంటే.. అదే సమయంలో మహిళలు కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5లో చాలా మంది భార్యలు కొన్ని సందర్భాల్లో తమ భర్తలు చేయి చేసుకోవడాన్ని సమర్థించడం గమనార్హం.

ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువగా ఉన్నారు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం తదితర సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గత సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది.  
చదవండి: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్‌

తెలుగు రాష్ట్రాలే టాప్‌..
నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ (83.8 శాతం) అగ్ర స్థానంలో, ఏపీ (83.6 శాతం) రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు (81.9 శాతం) భార్యలపై చేయి చేసుకోవచ్చన్నారు. హిమాచల్‌ ప్రదేశ్, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు.

భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా, పురుషుల్లో తగ్గుతోంది. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top