నేడు జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌ | TTD Arjita Seva and Darshan Ticket Release Date | Sakshi
Sakshi News home page

నేడు జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌

Mar 21 2024 8:42 AM | Updated on Mar 21 2024 9:19 AM

TTD Arjita Seva and Darshan Ticket Release Schedule - Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 65,051   మంది స్వామివారిని దర్శించుకోగా 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51  కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌
► మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

► జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

► మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తారు.

► మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

► మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

► మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

► మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

► మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

► మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement