ప్రమాద ఘం‘టీకా’ | Shortage of anti-rabies vaccine in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘం‘టీకా’

May 22 2026 5:52 AM | Updated on May 22 2026 5:52 AM

Shortage of anti-rabies vaccine in Andhra Pradesh

రాష్ట్రంలో కుక్కకాటు వ్యాక్సిన్‌కు తీవ్ర కొరత

బాబు పాలనలో పరిస్థితి అత్యంత దైన్యం

ప్రభుత్వాస్పత్రుల్లో నిల్వలు లేవు

బయట కొనుక్కుంటున్న బాధితులు

పేద, మధ్య తరగతి వర్గాలపై పెనుభారం

2025–26 నాలుగో క్వార్టర్‌ మందులకు మూడు నెలలు ఆలస్యంగా పీవోలు

ఫలితంగా ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్, వ్యాక్సిన్‌లకు తీవ్ర కటకట

2026–27 మొదటి క్వార్టర్‌ పీవోలు సగానికి కుదింపు

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రభుత్వాస్పత్రుల్లో కుక్క కాటు బాధితులకు వేసే యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ) వ్యాక్సిన్‌ కనీస నిల్వలు లేని దుస్థితి నెలకొంది. ప్రకాశం, అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూల్‌ సహా వివిధ జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రులను ఏఆర్‌వీ కొరత వేధిస్తోంది. చాలా చోట్ల వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, బాధితులే  బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. దీంతో పేద రోగులపై రూ.1,500 నుంచి రూ.2 వేల మేర భారం పడుతోంది. ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయాల్సిన ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్‌ఐడీసీ) సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌(సీడీఎస్‌)లలోనే ఏఆర్‌వీ కనీస నిల్వలు లేకపోవడం బాబు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది.

ఏటా రెండు లక్షలకుపైగా డోసులు అవసరం
రాష్ట్రంలో ఏటా రెండు లక్షలకు పైగా డోసుల యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ అవసరం. సాధారణంగా వ్యాక్సిన్‌ తయారీ సుదీర్ఘ ప్రక్రియ. కంపెనీలో తయారీ అనంతరం ప్రతి బ్యాచ్‌ వ్యాక్సిన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లే»ొరేటరీలో పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో తగ్గుతున్న నిల్వలను అంచనా వేసుకుంటూ ముందస్తుగా పర్చేజ్‌ ఆర్డర్‌(పీవో)లు ఇచ్చి వైద్య శాఖ వ్యాక్సిన్లు సమకూర్చుకోవాలి. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన మందులు, సర్జికల్స్‌కు 2025–26లో ప్రభుత్వం అరకొర బడ్జెట్‌ కేటాయించింది.

దీంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని, లేనిపక్షంలో మందులు కొనలేమని వైద్య శాఖ ప్రభుత్వాన్ని గతేడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కోరింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ కాలయాపన చేసిన సర్కారు అదనంగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో వైద్య శాఖలోనే వివిధ విభాగాల్లోని బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకుని మూడు నెలల ఆలస్యంగా మందులు, సర్జికల్స్‌కు పీవోలు ఇచ్చారు.

నిధుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం మందులు, సర్జికల్స్, వ్యాక్సిన్‌ సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది. వెరసి ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను ఏఆర్‌వీ, ఐవీ ఫ్లూయిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, ఫ్యాక్టర్స్‌ వంటి ఖరీదైన మందులతో పాటు, దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, షుగర్‌ వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అవసరమయ్యే మాత్రలకు తీవ్ర కటకట నెలకొంది.

కొనుగోళ్లలోనూ భారీగా కోత
ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్‌ సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతునే ఉంది. 2026–27 సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్‌ పీవోలు ఏప్రిల్‌ మొదటి, రెండో వారం లోపే ఇవ్వాల్సి ఉండగా మే నెల ముగుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. మరోవైపు 2026–27కు సంబంధించిన మొదటి క్వార్టర్, బఫర్‌ స్టాక్స్‌కు సంబంధించిన మందుల కొనుగోళ్లలోనూ రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల మేర కోత పెట్టినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఆస్పత్రుల నుంచి వచ్చే మందుల డిమాండ్స్, బఫర్‌ స్టాక్స్‌ కలిపి మొదటి క్వార్టర్‌లో కొనుగోళ్లు చేస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ. ఈ లెక్కన ప్రస్తుతం రూ.130 కోట్లకుపైగానే మందుల కొనుగోళ్లకు పీవోలు ఇవ్వాల్సి ఉంటుందని ఎంఎస్‌ఐడీసీ డ్రగ్స్‌ విభాగం తేలి్చనట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఆస్పత్రుల నుంచి వచి్చన డిమాండ్స్‌తో పనిలేకుండా కేవలం రూ.80 కోట్ల లోపు కొనుగోళ్లకే ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement