గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. | Road Accident Take Place At Guntur | Sakshi
Sakshi News home page

ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Aug 31 2020 6:17 PM | Updated on Aug 31 2020 6:58 PM

Road Accident Take Place At Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు దాచేపల్లి మండలం గామాలపాడు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది. అనంతరం పక్కనున్న నివాసాలపైకి దూసుకుపోయి గోడలకు ఆనుకుని తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయింది. దాంతో కారులో ఉన్న వారిలో ఒక యువకుడితో సహా మరొక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.(చదవండి: నా బావ ఏడీ.. అత్త, మామకు ఏమైంది?)

తమది నెల్లూరని, హైదరాబాదు నుంచి వస్తున్నామని గాయపడిన ఒక మహిళ చెప్పిందని స్థానికులు అంటున్నారు. అంతకుమించి కారులోని వారి వివరాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement