వేగంగా ప్రికాషన్‌ డోసు టీకా పంపిణీ

Rapid delivery of corona virus precaution dose vaccine Andhra Pradesh - Sakshi

18–59 ఏళ్ల వారిలో 15.53 లక్షల మందికి పంపిణీ

సెప్టెంబర్‌ నెలాఖరులోగా 3.43 కోట్ల మందికి వేసేలా చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్‌ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 18–59 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ నెల 15 నుంచి ఈ టీకా పంపిణీని ప్రారంభించారు. ఇప్పటివరకూ 15,53,703 మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా 1,15,076 మందికి ఇవ్వడం ద్వారా కర్నూల్‌ జిల్లా తొలి స్థానంలో ఉంది. అనంతరం.. 1.04 లక్షలతో విశాఖపట్నం, 85,569 మందితో శ్రీకాకుళం తర్వాత స్థానాల్లో నిలిచాయి. 

సెప్టెంబర్‌ నెలాఖరులోగా 3.43 కోట్ల మందికి
ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరులోగా రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ఈ ప్రికాషన్‌ టీకాను పంపిణీ చేయాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకూ 15.53 లక్షల మందికి వేశారు. గడువులోగా లక్ష్యం పూర్తికి వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారంలో రెండ్రోజులు కాలేజీలు, బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీకా పంపిణీ చేపడుతున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం మందగించింది. కానీ, అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు జిల్లాల వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించి పురోగతిపై ఆరా తీస్తున్నారు. రెండో డోసు టీకా వేసుకుని ఆర్నెలలు పూర్తయిన వారందరికీ ప్రికాషన్‌ డోసు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

73 శాతం పూర్తి
మరోవైపు.. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు 76,95,871 మందికి వేయాల్సి ఉండగా 56.19 లక్షల మందికి (73.02%) పూర్తయింది. అలాగే, హెల్త్‌కేర్‌ వర్కర్లు 98.46%, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 85.46 శాతం, 60 ఏళ్లు పైబడి 67.39 శాతం మందికి ప్రికాషన్‌ టీకా వేశారు. 

99.02% మంది పిల్లలకు రెండు డోసులు
ఇక 12–14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించగా.. అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి తొలి డోసు పంపిణీని వైద్యశాఖ పూర్తిచేసింది. 99.02 శాతం మందికి రెండో డోసు టీకా ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో రెండు డోసుల పంపిణీ వంద శాతం  ముగిసింది. కనిష్టంగా విజయనగరం జిల్లాలో 93.5 శాతం, ఏఎస్‌ఆర్‌ జిల్లాలో 95.73 శాతం మందికి రెండు డోసుల టీకా వేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 97 శాతానికి పైగా రెండు డోసులు పంపిణీ చేపట్టారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-08-2023
Aug 11, 2023, 10:12 IST
కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది....
13-06-2023
Jun 13, 2023, 05:33 IST
న్యూఢిల్లీ:  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం తీసుకొచ్చిన కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను...
27-05-2023
May 27, 2023, 05:51 IST
వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో...
15-04-2023
Apr 15, 2023, 05:40 IST
లండన్‌: కోవిడ్‌–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా...
13-04-2023
Apr 13, 2023, 06:19 IST
న్యూఢిల్లీ: తగిన డిమాండ్‌ లేకపోవడం, కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా ఉత్పత్తిని తాజాగా...
09-04-2023
Apr 09, 2023, 04:19 IST
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 31,194కు చేరినట్లు...
08-04-2023
Apr 08, 2023, 04:44 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ...
03-04-2023
Apr 03, 2023, 06:01 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఆరు...
28-03-2023
Mar 28, 2023, 06:06 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం...
26-03-2023
Mar 26, 2023, 03:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు­త్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల...
20-03-2023
Mar 20, 2023, 05:21 IST
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35...
19-03-2023
Mar 19, 2023, 04:06 IST
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్‌ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా...
18-03-2023
Mar 18, 2023, 04:25 IST
కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే...
04-03-2023
Mar 04, 2023, 14:06 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆండ్రీ బోటికోవ్‌ ఒకరు.
22-01-2023
Jan 22, 2023, 06:21 IST
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ...
14-01-2023
Jan 14, 2023, 05:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి...
14-01-2023
Jan 14, 2023, 04:56 IST
బీజింగ్‌: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌...
11-01-2023
Jan 11, 2023, 18:10 IST
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ...
08-01-2023
Jan 08, 2023, 09:48 IST
గుంటూరు మెడికల్‌ : అమెరికా నుంచి గుంటూరు వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుమారు పదిరోజుల కిందట ముత్యాలరెడ్డినగర్‌కు...
08-01-2023
Jan 08, 2023, 05:58 IST
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్‌ యున్‌’లూనార్‌ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి... 

Read also in:
Back to Top