యూట్యూబ్‌లో చూసి ప్లాన్‌.. భార్యకు పాలకోవా తినిపించి.. | Police Crack The Case Of Married Proddatur Woman Padmaja | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో చూసి ప్లాన్‌.. భార్యకు పాలకోవా తినిపించి..

May 5 2026 1:56 PM | Updated on May 5 2026 4:18 PM

Police Crack The Case Of Married Proddatur Woman Padmaja

సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత ప‌ద్మ‌జ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భ‌ర్త కిర‌ణ్‌కుమార్.. పాలకోవలో విషం కలిపి హ‌త్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిర‌ణ్‌కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజ‌రుప‌రిచారు.

భర్త కిరణ్.. భార్య హ‌త్య‌కు యూట్యూబ్‌లో శోధించి ప్లాన్‌ వేశాడు. హైద‌రాబాద్‌ నుంచి ప్రొద్దుటూరుకు కొరియ‌ర్ ద్వారా విషం తెప్పించిన భ‌ర్త‌.. పాల‌కోవాలో విషం క‌లిపి భార్య‌కు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చ‌నిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్‌.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్‌ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

లావుగా ఉందని భార్యను చంపిన భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement