‘తోలు వలిచేస్తా.. లం..కొ..’ | Pithapuram Municipal Commissioner Kanaka Rao Abuses Staff | Sakshi
Sakshi News home page

‘తోలు వలిచేస్తా.. లం..కొ..’

Mar 31 2026 5:35 AM | Updated on Mar 31 2026 5:35 AM

Pithapuram Municipal Commissioner Kanaka Rao Abuses Staff

దళిత ఉద్యోగిపై పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ బూతు పురాణం

పిఠాపురం/సాక్షి, అమరావతి: ఓ దళిత శానిటరీ ఉద్యోగిపై కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ నామా కనకారావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోనులో తిట్ల దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వలిచేస్తానంటూ వారి్నంగ్‌ ఇచ్చారు. రాయడానికి వీలు లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్‌ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాలివీ.. పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక వాలీబాల్‌ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడొకరు మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావుకు ఫిర్యాదు చేశారు.

పిఠాపురం రథాలపేట సచివాలయ పరిధిలో పని చేస్తున్న సు«దీర్‌ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్‌ వద్ద నుంచే ఆ నాయకుడు ఫోనులో మాట్లాడారు. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్‌ కోర్టులో మట్టి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఆ పనిని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చూస్తున్నారని, ఆయనకు చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి సు«దీర్‌ చెబుతూండగానే ‘సార్‌ మాట్లాడతారు’ అంటూ ఆ నాయకుడు కమిషనర్‌కు ఫోన్‌ ఇచ్చారు. ఫోన్‌ అందుకున్న కమిషనర్‌... ‘ఏం చెప్పాలి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నీకు? వార్డులో నుంచి డబ్బులు తీసుకు రమ్మని చెప్పాలా? లేదంటే ఎగ... ఎల్లండిరా అని చెప్పాలా? ఇప్పటి వరకూ మీరంతా కలిసి చేసిన దందాగిరీ చాలదంటరా వెధవా? మండపేటను నాశనం చేసి వచ్చావు. 

మళ్లా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? ల..ట్‌ నాయాలా.. అతను చెప్తే నేను చెప్పినట్టే అని మస్తర్లకు వచి్చనప్పుడు చెప్పాను. అందరితో నేను మొ... గు... వాలంటే నా నోరు కూడా నొప్పేస్తది కదా. మీయమ్మ లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది కదా.. మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్‌కి ఎలుతుంది. నా ఊరు వెళ్లలేదు పెంట తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా లం..కొ.. మండపేట నుంచి నువ్వు పనికిరావనే కదా వాడు గెంటేశాడు రంగారావు. అవునా? కాదా? మరి! ఇక్కడ రాజకీయాలు దెం..న్నావా ల..ట్‌ నాయాలా! ఒక గంటలో అది క్లీన్‌ కాలేదనుకో.. తోలు వలిచేస్తాను’ అంటూ తీవ్ర పదజాలం, బూతులతో దుర్భాషలాడారు. 

పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి 
శానిటేషన్‌ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన మున్సిపల్‌ కమిషనర్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ దారపురెడ్డి తాతాజీ, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్‌ ఎస్‌కే బాషా, జనరల్‌ సెక్రటరీ జాన్, వైస్‌ ప్రెసిడెంట్‌ కన్నారావు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement