
విజయవాడ: మందు బాబులతో భారీగా మద్యం తాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది చందరబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. సాధ్యమైనంత ఆదాయాన్ని మద్యం ద్వారానే సాధించాలనే లక్ష్యంతో మరో అడుగుముందుకేసి తెల్లవారుజాము వరకూ బార్లు తెరిచే పాలసీని తీసుకొచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీని ప్రకటించింది.
నూతన మద్యం పాలసీని ఎక్సైజ్ కమిసనర్ నిశాంత్ కుమార్ ఈరోజు(సోమవారం) ప్రకటించారు. ప్రధానంగా శుక్ర, శని వారాల్లో తెల్లవారుజాము 1 గంట వరకూ బార్లకు అనుమతిస్తూ పాలసీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన ఐదు రోజులు ఉదయం గం. 10 గంటల నుండి అర్థరాత్రి గం. 12 గంటల వరకూ బార్లకు అనుమతి ఉందని తెలిపారు. ఫలితంగా సాధారణ రోజుల్లో రోజుకి 14 గంటల పాటు బార్లు తెరుచుకోనుండగా, శుక్ర, శని వారాల్లో 15 గంటల పాటు బార్లు తెరుచుకుని ఉంటాయి.