నెల్లూరు రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు

Nellore Railway Station to be Developed with Rs 102 Crore - Sakshi

రూ.102 కోట్లతో ఆధునికీకరణ పనులు

ఎస్‌సీఆర్‌ జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ వెల్లడి  

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు, సరికొత్త హంగులతో నెల్లూరు రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్‌ ద్వారా రోజూ సుమారు 30 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ దృష్ట్యా నెల్లూరు రైల్వేస్టేషన్‌ను రూ.102 కోట్లతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 

గత ఆగస్టులో ఎస్‌సీఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ సంస్థకు పనులు అప్పగించింది. 2024 మే నెలకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టేషన్‌లో పశ్చిమం వైపు ఉన్న జీ+2 భవనం, తూర్పు వైపు ఉన్న జీ+1 భవన నిర్మాణాలను పొడిగిస్తూ ప్రత్యేక ఆకర్షణతో ఆధునికీకరించడం, ప్లాట్‌ఫాం నంబర్‌ 1, 2, 3, 4 నుంచి తూర్పు, పశ్చిమంలోని అరైవల్‌ బ్లాక్‌కు చేరుకునేలా సబ్‌వే నిర్మాణాలు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, భూగర్భ, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల ఏర్పాటు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. 

స్టేషన్‌ ఆవరణలోని కోర్టు, రైల్వే పోలీసుల కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా కార్యాలయాల కోసం తాత్కాలిక నిర్మాణాలు పూర్తి చేశారు. శాశ్వత నిర్మాణాలకు మార్కింగ్‌ పనులు చేశారు. ప్లాట్‌ఫాం నంబర్‌ 1లో కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ ఫాంలను ఏర్పాటు చేసేందుకు పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. పనులను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ తెలిపారు. (క్లిక్ చేయండి: వలంటీర్‌ మారినా ఫోన్‌ నంబర్‌ మారదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top