శ్రీరామనవమి: చెప్పులేసుకుని మంత్రి పట్టువస్త్రాలు! | Rayachoti Temple Incident, Minister Ramprasad Reddy Faces Backlash For Wearing Shoes During Sacred Ritual | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి: చెప్పులేసుకుని మంత్రి పట్టువస్త్రాలు!

Mar 27 2026 9:02 PM | Updated on Mar 28 2026 1:35 PM

Minister Ram Prasad Reddy Disrespect at the Rayachoti Rama Temple

రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ఎన్జీవో కాలనీ కోదండ రామాలయంలో అపచారం చోటు చేసుకుంది. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పులేసుకుని రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి పట్టు వస్త్రాలు నెత్తిన పెట్టుకుని చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.  స్వామివారికి పట్టువస్త్రాలు  సమర్పించే  క్రమంలో మంత్రితో పాటు అతని భార్య, కుమారుడు సైతం చెప్పులతోనే తాంబూలాదులు పట్టుకోవడం విమర్శలకు దారి తీసింది.

చెప్పులేసుకుని స్వామివారికి పట్టువస్త్రాలు తేవడం ఏంటని ఇది చూసిన వారు విస్తుపోతున్నారు.  ఏ దేవుని కార్యక్రమం చేసినా చెప్పులు తీసేసి చేయడం సర్వసాధారణం. కనీసం అది కూడా  మంత్రి స్థానంలో ఉన్న రాంప్రసాద్‌రెడ్డికి తెలియడం లేదా అని జనం విమర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement