రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్‌తో తొక్కించి

Liquor Bottles Worth Rs 13 Crores Crushed Under Road Roller At Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది.

జిల్లా పోలీçసు బాస్‌ల పర్యవేక్షణలో సెబ్‌ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు.  

పక్కాగా.. 
మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్‌డీపీఎల్, డీపీఎల్‌) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్‌ విజయారావు పర్యవేక్షణలో సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్‌ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 

మాకివ్వండి సారూ..
పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్‌ విజయారావు పర్యవేక్షణలో సెబ్‌ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్‌్కఫోర్స్‌ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top